Thursday, 21 May 2009

పొడి చెట్ని

Posted by angara. sailaja at 5/21/2009 12:04:00 AM 0 comments
కావలసిన పదార్ధాలు:
శనగ పప్పు:ఒక కప్పు
మినపప్పు:ఒక కప్పు
చింతపండు:చిన్న నిమ్మకాయంత
ఎండు మిరపకాయలు(ముక్కలు చేసినవి):అర కప్పు
ఎండు కొబ్బరి(తురిమినది):ఒక కప్పు
బెల్లం:అర కప్పు
ఉప్పు: తగినంత
తయారీ విధానం:
ముందుగ మూకుడులో శనగ పప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, ఎండు కొబ్బరి విడివిడిగా వేయించుకోవాలి. ముందుగ పప్పులు రెండు మిక్సిలో వేసి మెత్తగ పొడి చేసుకోవాలి. కొంచెం పొడి విడిగా తీసుకుని మిగిలిన పొడిలో చింతపండు వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని పైన విడిగ తీసుకున్న పొడిలో కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం పొడి విడిగా తీసుకుని దానికి ఎండు మిరపకాయలు కలిపి పొడి చేసుకుని దీనిని మొత్తం పొడిలో కలుపుకోవాలి. ఇలానే ఎండు కొబ్బరి, బెల్లం కూడా విడివిడిగా మిక్సిలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇలా అన్ని పొడిచేసుకున్న తర్వాత ఉప్పు వేసి కలుపుకుని నెయ్యి వేసి పోపు వేసుకోవాలి. ఈ పొడి కొంచెం తియ్యగా వుంటుంది. అన్నంలో, దోస, ఇడ్లీలలోకి బాగుంటుంది.

Wednesday, 20 May 2009

కంది పొడి

Posted by angara. sailaja at 5/20/2009 11:32:00 PM 0 comments

కావలసిన పదార్ధాలు:
కంది పప్పు:ఒక కప్పు
మినపప్పు:ఒక కప్పు
శనగ పప్పు:ఒక కప్పు
పెసర పప్పు:ఒక కప్పు
ఎండు మిరప కాయలు(ముక్కలు చేసుకున్నవి): ఒక కప్పు
జీలకర్ర:పావు టీస్పూన్
ఇంగువ:ఒక చిటికెడు
ఉప్పు: తగినంత
తయారీ విధానం:
ముందుగా మూకుడులో పప్పులన్నీ కంది పప్పు, శనగ పప్పు, పెసర పప్పు, మినపప్పు వరుసగ విడివిడిగా వేయించుకోవాలి. చివరగ ఎండుమిరపకాయలు కొద్ది ఉప్పుతో వేయించుకోవాలి. పప్పులు వేడిగ వున్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి. అన్ని చల్లారాక మిక్సిలో వేసి మెత్తగ పొడి చేసుకోవాలి. ఆ పోడిలో మిగిలిన ఉప్పు వేసికలుపుకోవాలి. ఈ పొడి వేడి అన్నంలో నూనే వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది.

Thursday, 7 May 2009

వంకాయ బంగాళదుంప కూర

Posted by angara. sailaja at 5/07/2009 05:55:00 PM 0 comments

ఇది కొంచెం టైం పట్టే కూర కాని రుచి చాలా బాగుంటుంది.
కావలసిన పధార్ధాలు:
వంకాయలు:పావుకిలో
బంగాళదుంపలు:వంద గ్రాములు
పల్చటి చింతపండు పులుసు:ఒక టేబుల్ స్పూన్
పచ్చి మిరపకాయలు:మూడు (నిలువుగ తరిగినవి)
ఉప్పు: తగినంత
పసుపు;చిటికెడు
కూర/మెంతి పొది:రెండు టేబుల్ స్పూన్స్
పోపు:ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు,
నూనె:మూదు టేబుల్ స్పూన్స్
కూర/మెంతి పొడికి:
ధనియాలు: రెండు చెంచాలు
సనగ పప్పు: రెండు చెంచాలు
మినపప్పు: రెండు చెంచాలు
ఎండు మిరపకాయలు:మూడు
మెంతులు:నాలుగు లేదా ఆరు
పై పధార్ధాలన్నిటిని మూకుడులో ఒక పావు చెంచా నూనే వేసి చిన్న మంట మీద దోరగ వేయించుకుని, మెత్తగ పొడి చేసుకోవాలి. ఈ పొడి నిలవ కూడ వుంటుంది.
కూర తయారీ విధానం:
ఒక మూకుడులో ఒక చిన్న చెంచా నూనె వేసి బంగాళదుంపలు, వంకాయ ముక్కలు చింతపండు పులుసు పోసి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత, వాటిని ఒక జల్లి పళ్ళెంలోకి మార్చుకుని నీరు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి పోపు వేసుకుని అది వేగాక ఉడికించిన బంగాళదుంప, వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి,నిలువుగ తరుగుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ముక్కలు కొంచెం వేగాక(అంటే 2 నిమిషాల తర్వాత) పైన తయారు చేసుకున్న కూర పొడి వేసుకోవాలి. అంతే కూర తయరు.

Thursday, 23 April 2009

అరటికాయ ఆవకూర

Posted by angara. sailaja at 4/23/2009 06:32:00 PM 1 comments

ఆవ, నువ్వులపొడి రుచి నచ్చె వాళ్ళు ఈ కూరలు ప్రయత్నం చేయవచ్చు. కొత్త రుచులు ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు కూడ.
కావలసిన పధార్ధాలు:
అరటికాయ: రెండు(కొంచెం పెద్ద ముక్కలు తరిగినవి)
ఆవ: ఒక చిన్న కప్పు
ఉప్పు:తగినంత
పసుపు:చిటికెడు
పల్చటి చింతపండు పులుసు:ఒక టేబుల్ స్పూన్
పోపు: మినపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయ, కరివేపాకు,
ఆవ తయారికి:
నాన పెట్టిన బియ్యం: ఒక చెంచా
ఆవాలు:అర చెంచా
తెల్ల నువ్వుల పప్పు:పావు చెంచా
ఎర్ర కారం:అర చెంచా
పచ్చి కొబ్బరి:చిన్న ముక్క
ఇంగువ: చిటికెడు
పై పధార్ధాలన్ని కలిపి నీరు పోస్తూ బాగా మెత్తగ రుబ్బుకోవాలి.


తయారి విధానం:


మూకుడులో నూనె వేసి పోపు వేసి, అరటికాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు, పసుపు వేసి, చింతపండు పులుసు పోసుకుని బాగ ఉడకనివ్వాలి. ఆరతికాయ ముక్కలు ఉడికాక పైన రుబ్బుకున్న ఆవ కలుపుకోవాలి.

Tuesday, 21 April 2009

పెసర కట్టు

Posted by angara. sailaja at 4/21/2009 06:19:00 PM 0 comments


కావలసిన పధార్ధాలు:

పెసర పప్పు: ఒకటిన్నర కప్పు
అల్లం:చిన్న ముక్క(చిన్న ముక్కలుగ తరిగినవి)
పచ్చి మిరపకాయ:ఒకటి(చిన్న ముక్కలుగ తరిగినవి)
నిమ్మకాయలు:రెండు
ఉప్పు:తగినంత
పసుపు:చిటెడు
ఇంగువ:చిటికెడు
పోపు:ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు
తయారీ విధానం:
ఒక గిన్నెలో నూనే వేసి పోపు వేసి, పోపు చిటపటలాడుతున్నప్పుడు, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పెసర పప్పు వేయాలి. ఫప్పు మునిగేంత వరకు నీరు పోసి ఉడకనివ్వాలి. ఫప్పు ఉడికాక అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. కొంచెం నీరు తగ్గాక stove మీదనించి దించి చల్లారాక నిమ్మకాయ పిండాలి.
గమనిక: ఈ పప్పు పల్చగానే ఉంటుంది.
 

ఉల్లి లేని వంటలు Copyright 2009 Sweet Cupcake Designed by Ipiet Templates Image by Tadpole's Notez